మోడీ వంద రోజుల పాలన భేష్ : కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ వంద రోజుల పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సంస్కరణల్లో వేగం పెరిగిందన్నారు. పలు కీలక బిల్లులు పార్లమెంటులో ఆమోదించామన్నారు. ఆర్థిక వ్యవస్థ కుంగిపోకుండా  మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. గతేడాది కంటే ఎగుమతులు పెరిగాయన్నారు. 331మిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయని చెప్పారు. రోజుకు సరాసరి 30 కి.మీ రహాదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్ నిర్మాణం అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు కిషన్ రెడ్డి.

 

Latest Updates