రాష్ట్రానికి రూ.2,719 కోట్లు ఇచ్చినం

లాక్ డౌన్ టైంలో దేశ ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం చేపట్టిన గరీబ్ కల్యాణ్ యోజన కింద రాష్ట్రానికి రూ.2,719 కోట్లు ఇచ్చినట్లుకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆ పథకం కింద పేదలతోపాటు వివిధ వర్గాల వారికి కేంద్ర సహకారం అందిందని చెప్పారు. కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో బుధవారం మాట్లాడారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రూ. రెండు వేల చొప్పున జమ య్యాయని.. ఇందుకు కేంద్రం రూ.658 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. జన్ ధన్ అకౌంట్లు కలిగిన మహిళల కోసం రూ.263 కోట్లు, స్టేట్ డిజాస్ట ర్ నిధుల కింద రూ.224 కోట్లు, ఉద్యో గుల ఈపీఎఫ్ నిధులకు రూ.207 కోట్లు, భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.126 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రత్యేక హాస్పిట ళ్లు, వైద్య పరికరాల కోసం మరో రూ.215 కోట్లు ఇచ్చామని తెలిపారు. వీటికి తోడు రాష్ట్రానికి రూ. 982 కోట్ల డెవల్యూషన్ ఫండ్ ను కేంద్రం విడుదల చేసిందన్నా రు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు కేంద్రం పింఛన్లు అందిస్తోందని వెల్లడిం చారు. రాష్ట్రానికి 27,500 పీపీఈ కిట్లు, లక్ష ఎన్ – 95 మాస్క్ లు అందజేశామన్నారు. తెలంగాణలో కరోనా టెస్టుల కోసం 8 ప్రభుత్వ, 12 ప్రైవేటు ల్యాబ్ లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. బియ్యంలో కేంద్రం వాటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఉచిత బియ్యం లో కేంద్రం వాటా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున బియ్యం ఇస్తోందని చెప్పారు. రాష్ట్ర సర్కారు ఏప్రిల్ నెలకుగాను 98,810 టన్నుల బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) నుంచి ఇస్తుందని తెలిపారు. రెం డో విడత కేంద్ర సహాయం కూడా వస్తోందన్నారు. కేంద్రం బియ్యంతోపాటు పప్పు కూడా ఇస్తోందని, కానీ కొన్ని రాష్ట్రాలు దానిని ప్రజలకు పంపిణీ చేయడం లేదని చెప్పారు. ప్రజలకు పప్పు వెంటనే అందించాలని కోరారు.

రెడ్ జోన్లలో సడలింపులు ఉండవు

మే 3 తర్వాత కూడా రెడ్ జోన్లు , కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులు ఉండవని కిషన్ రెడ్డి చెప్పారు. గ్రీన్ జోన్ లలో పరిశ్రమలు తెరవడం, మిగతా కార్యకలాపాలకు అనుమతి ఉంటుందన్నారు. కరోనా తీవ్రతను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని డిసీజెస్ యాక్ట్ లో ఉందని వివరించారు. ప్రధాని మోడీ మేధావులు, ఆర్థికవేత్తలు, సైంటిస్టులు, కేంద్ర సీనియర్ మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ అభిప్రాయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆర్థిక వృద్ధి కోసం కేంద్రం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు.

Latest Updates