‘రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి‘

పుల్వామా దాడి ఘటనపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పబట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కితీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు.  పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాహుల్ వ్యాఖ్యలు పుల్వామా దాడిలో  మరణించిన వారిని కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. పుల్వామా దాడి, ఆ ఘటన తర్వాత జాతీయ భద్రతా సంస్థ జరిపిన దర్యాప్తుపై  ఆయన వ్యాఖ్యలు భాద్యతారాహిత్యమన్నారు.  పుల్వామా దాడికి కారణమైన ఉగ్రమూకలను బాలాకోట్ వైమానికి దాడి ద్వార హతమార్చి ఆ దాడికి భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందన్నారు కిషన్ రెడ్డి.

see more news

రావాలి జగన్ కావాలి జగన్ అని..జైలు పిలుస్తుంది

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన AR రెహ్మాన్

దారుణం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య

Latest Updates