సుష్మాస్వరాజ్ చనిపోతే కనీసం చూడని వ్యక్తులా మాట్లాడేది..

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. కేటీఆర్ ఎవరో తెలియదని తాము కూడా అనొచ్చని.. కానీ తమకు సభ్యత అడ్డొస్తోందని అన్నారు. కేటీఆర్ అహంకారానికి అది సంకేతం అన్నారాయన. నడ్డా ఎవరో తెలియదని చెప్పిన కేటీఆర్.. గతంలో ఎలా కలిశారో చెప్పాలన్నారు. తెలంగాణలో బీజేపీ లేదని కేటీఆర్ అన్నాడనీ.. ఐతే నిజామాబాద్ లో కవిత ఎలా ఓడిపోయిందో చెప్పాలన్నారు. సుష్మ స్వరాజ్ చనిపోతే కనీసం చూడని వ్యక్తులు వ్యక్తులు ఇపుడు మాట్లాడుతున్నారని అన్నారు.

ఏపీ రాజధాని మారుతుందన్న విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని అన్నారు కిషన్ రెడ్డి. అది కేంద్రం పరిధిలోకి రాదన్నారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయుష్మాన్ భవ బక్వాస్ అన్న టీఆర్ఎస్ నాయకుల దృష్టిలో ఆరోగ్యశ్రీ మంచిదైనప్పుడు.. ధర్నాలు ఎందుకు చేస్తున్నారో వివరించి చెప్పాలన్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని కిషన్ రెడ్డి చెప్పారు.

Latest Updates