నడ్డా గురించి లక్ష్మారెడ్డిని అడిగి తెలుసుకో

హైదరాబాద్ : ఈఎస్ఐతో రాష్ట్రంలో కార్మికులు, వారి కుటుంబాలకు మంచిసేవలు అందిస్తున్నామన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. బుధవారం సనత్ నగర్ లోని ESI మెడికల్ కాలేజి, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ను కేంద్ర కార్మికమంత్రి సంతోష్ గంగ్వార్ ప్రారంభిస్తారని తెలిపారు. 1150 కోట్లతో ఈఎస్ఐను ఆధునీకరించామని చెప్పారు.

హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాల్లోనూ ESI  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటుకు కేంద్రమంత్రితో చర్చిస్తానన్నారు. కేటీఆర్ కు నడ్డా ఎవరో తెలియాలంటే గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన లక్ష్మారెడ్డిని అడగాలన్నారు కిషన్ రెడ్డి.

Latest Updates