దుబ్బాకలో ఓడించి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి

తెలంగాణలో ఫ్యామిలీ పాలన కొనసాగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లిలో ఎన్నికల ప్రచారం పాల్గొన్నకిషన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ మర్చిపోయారన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత పావలా వడ్డీ రుణాలు మహిళలకు ఇవ్వడం లేదన్నారు. రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  ఇవ్వలేదన్నారు. కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. వర్షాలకు  పంట నష్టపోతే కూడా పంటకు ఇన్సూరెన్స్ ఇస్తలేడన్నారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి..కుటుంబంలో అందరికీ ఉద్యోగం ఇప్పించుకున్నాడన్నారు. ఎన్నికల్లో ఓడించి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలయిందన్నారు.

ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రి గేట్ వద్ద వదిలేసింది

పెళ్లి వ్యాన్ బోల్తా పడి ఏడుగురు మృతి

యువతిపై కత్తితో దాడి చేసి పొదల్లో పడేసి..

Latest Updates