కేసీఆర్ మాటలు ఫాం హౌజ్ దాటవు

హైదరాబాద్: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ నెరవెర్చలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బోరబండలో బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. ఇళ్ల పేరుతో మోసం చేసిన కేసీఆర్ కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ హైదరాబాద్ కు కొత్తగా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. కేసీఆర్ మాటలు ఫాం హౌజ్ దాటవని విమర్శించారు. కబ్జాదారులంతా ప్రస్తుతం టీఆర్ఎస్ లోనే ఉన్నారని ఆరోపించారు.

Latest Updates