ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకే స్టీల్‌ బ్రిడ్జిలు

హైద‌రాబాద్ : స్టీల్ బ్రిడ్జితో ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి. శ‌నివారం ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో నిర్మించే ఎలివేటెడ్‌ కారిడార్‌ స్టీల్‌ బ్రిడ్జికు మంత్రి కేటీఆర్ తో క‌లిసి‌ శంకుస్థాపన చేశారు కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కిష‌న్ రెడ్డి..ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ స‌మ‌స్య చాలా కాలంగా ఉంద‌ని..ఈ ఫ్లైఓవ‌ర్ తో ట్రాఫిక్ స‌మ‌స్య తీరుతుంద‌న్నారు. హైదరాబాద్ నగరంలో జన సాంద్రత పెరిగి చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్లు ఫ్లైఓవర్ చాలా ముఖ్యమైనవన్నారు. సిటీలో పెట్టుబడిదారులు మరింత మంది రావాలి అంటే ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని తెలిపిన కిష‌న్ రెడ్డి… అభివృద్ధి కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా సహకరించుకోవాలన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. రూ. 426 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో రెండు ఫ్లై ఓవర్లు నిర్మించడానికి ఈ శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. లాక్ ‌డౌన్ సమయంలో నాలుగు రెట్ల వేగంగా రోడ్ల పనులు జరిగాయన్నారు. అంబర్ ‌పేట ఫ్లైఓవర్ పనులు కూడా త్వరలో చేపట్టి, వేగంగా పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని రక్షణ రంగానికి సంబంధించిన స్థలాలు రోడ్డు డెవలప్మెంట్ కోసం అవసరం అవుతున్నాయన్నారు. అందుకు కావలసిన స్థలాలు కూడా ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ ‌రెడ్డికి కేటీఆర్ రిక్వెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌, మేయర్ రామ్మోహన్, కమిషనర్ లోకేష్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates