సిటీలో గుంతల్లేని రోడ్డు చూపిస్తే లక్ష రూపాయలు

హైదరాబాద్ ను డల్లాస్ చేస్తానన్న సీఎం కేసీఆర్.. కనీసం నాళాల్లో పూడిక కూడా తీయించలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. డబుల్ బెడ్రూం ఇళ్లపై టీఆర్ఎస్ సర్కార్ మాట తప్పిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. హైదరబాద్ లో డబుల్ బెడ్రూం ఇళ్లకు 30 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు.  డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రజలు సర్కార్ ను నిలదీయాలన్నారు. గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ గెలిచిందన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందన్నారు. వర్షం వస్తే రాజ్ భవన్ ,సెక్రటేరియేట్ ముందు నీరు నిలుస్తుందన్నారు. చిన్న వర్షాలకే నగరం మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఏ మాత్రం బాగుచేయలేదన్నారు. హైదరాబాద్ తో బీజేపీకి విడదీయరాని సంబంధం ఉందన్నారు. గ్రేటర్ లో గెలవాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. రేపటి నుంచి గ్రేటర్ లో ఎన్నికల ప్రచారం జరుగుతుందన్నరు.

భారీ వర్షాలతో 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.67 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కనీసం వర్షపు నీరు బయటకు పంపే పని జరగలేదు.టీఆర్ఎస్ గ్రాఫిక్స్ తో ప్రజలను మభ్యపెడుతుందన్నరు. డల్లాస్ దేవుడెరుగు..కనీసం నాళాల్లో పూడిక తీయలేదన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తమన్నారు. వరదల కారణంగా హైదరాబాద్ లో 40 మంది చనిపోయారన్నారు. హైదరాబాద్ చుట్టూ 4 ఆస్పత్రులు కట్టిస్తామని మర్చిపోయారు. కేసీఆర్ సీఎం కాకముందే మెట్రో ప్రారంభమైందన్నారు. మూసీ ప్రక్షాళన ఎందుకు కాలేదన్నారు. జీహెచ్ఎంసీని అప్పుల పాలు చేశారన్నారు. సీటీలు గుంతలు లేని రోడ్డు చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తామన్నారు.

Latest Updates