టాలీవుడ్ సభ్యులతో కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : కరోనా ఎఫెక్ట్ తో అన్ని రంగాలు కష్టాల్లో పడ్డాయని.. అందులో సిని ఇండస్ట్రీ కూడా ఉందన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఆయన శనివారం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో పాటు.. డైరెక్టర్ తేజ, జెమినీ కిరణ్ , త్రిపురనేని వరప్రసాద్, దాము, వివేక్ కూచిభొట్ల, అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్ ,శరత్, ప్రశాంత్, రవి, అనిల్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కిషన్ రెడ్డి..ఇండస్ట్రీలో సమస్యలు, షూటింగ్స్ పై చర్చించారు. సెన్సార్ బోర్డుకు సంబంధించిన సమస్యలు, ఫైరసీతో పాటు పలు సమస్యలను కిషన్ రెడ్డికి తెలిపారు సినీ ప్రముఖులు.

దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్ లకు సంబంధించి త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. అంతర్జాతీయ సినిమా పైరసీపై త్వరలో మీటింగ్ నిర్వహించి , పైరసీ కోసం కొత్త చట్టం చేస్తామన్నారు. OTTలో రిలీజ్ అయ్యే సినిమాలకు సెన్సార్ ఉండేలా ఆలోచన చేస్తామని.. దేశవ్యాప్తంగా జమ్ము కాశ్మీర్ తో సహా షూటింగులు చేసుకునేందుకు అనుమతులిస్తామని చెప్పారు. థియేటర్లు దేశ వ్యాప్తంగా ఒకేసారి ఓపెన్ అయ్యేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Latest Updates