శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి

జమ్ము కాశ్మీర్ ను భారతదేశంలో పూర్తిగా వీలీనం చేయడం సంతోషం కలిగిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ప్రజలందరూ సంతోషంగా వుండేలా మోడి పరిపాలన వుంటుందన్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేయగా.. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గతేడాదితో పోలిస్తే 15 శాతం అధికంగా వర్ష పాతం నమోదుకావడం సంతోషంగా ఉందన్నారు కిషన్ రెడ్డి.

Latest Updates