‘TRS సర్కారు MIM చేతిలో కీలుబొమ్మ’

ఎన్నో పోరాటాలు చేసి నిజాం నుంచి స్వాతంత్ర్యం పొందితే… సీఎం కేసీఆర్ మళ్లీ నిజాంకు అధికారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. TRS సర్కారు MIM చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. మాజీఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి కిషన్ రెడ్డి గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి. హామీలు నెరవేర్చని TRS కు ఓటెందుకేయాలని ప్రశ్నించారు. అంతకుముందు బెల్లంపల్లి చేరుకున్న కిషన్ రెడ్డి, వివేక్ లకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రైల్వేస్టేషన్ నుంచి భారీ బైక్ ర్యాలీ తీశారు.

Latest Updates