వీడియో: నా మీదే పోటీచేస్తావా.. డివిజన్‌లో నీకు జాగా లేకుండా చేస్తా..

గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. నేతలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్నటిదాకా టీఆర్ఎస్ మిత్రపక్షంలా ఉన్న ఎంఐఎం.. నేడు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మాటల యుద్దానికి దిగుతుంది. ఓల్డ్ సిటీలో ఎంఐఎం నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులను అంతచూస్తామనేదాకా వెళ్లింది ఎన్నికల ప్రచారం. తాజాగా.. కిషన్ బాగ్ మజ్లీస్ అభ్యర్థి హుస్సేనీ పాషా గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో మాట్లాడుతూ.. తనపై పోటీచేసిన టీఆర్ఎస్ నేతలను బెదిరిస్తూ మాట్లాడారు. కొందరు కావాలనే డబ్బులకోసం టీఆర్ఎస్‌లో చేరారని.. తాను గెలిచాకా.. తనపై పోటీ చేసిన వారి అంతుచూస్తానని బెదిరించాడు. ఎన్నికలైపోగానే తనపై పోటీచేసినవారికి కిషన్ బాగ్‌లో జాగా లేకుండా చేస్తామని హెచ్చరించాడు.

For More News..

బాలీవుడ్‌లోకి ప్రభాస్ ఛత్రపతి.. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్

ఈ మాస్క్ ధర రూ. 7 లక్షలు.. ఎందుకో తెలుసా?

గ్రేటర్​లో టీఆర్ఎస్​కు నిరుద్యోగులు షాక్ ఇస్తరు!

Latest Updates