కరెంట్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్ల కాడ.. పతంగులు ఎగరవేయొద్దు

  • వైర్లు తెగిపడితే 1912కు కాల్ చేయండి
  • టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎండీ రఘుమా రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కరెంట్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్ లకు సమీపంలో  పతంగులు ఎగురవేయొద్దని టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎండీ జి. రఘుమా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖాళీ ప్రాంతాలు, ప్లే గ్రౌండ్స్‌‌లోనే పతంగులు ఎగరవేయాలని సూచించారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగరవేస్తే.. మాంజాలు వాటిపై పడి ప్రమాదాలు జరగొచ్చని, కరెంట్ సప్లైకి ఇబ్బందులు ఏర్పడొచ్చని తెలిపారు.  ఎక్కడైనా కరెంట్ వైర్లు తెగిపడితే వాటికి దూరంగా ఉండాలని,  ముట్టుకోకూడదని, వెంటనే 1912కు ఫోన్ చేయడం లేదా కరెంట్ ఆఫీసు, సంస్థ మొబైల్ యాప్, వెబ్‌‌సైట్‌‌లో ద్వారా వివరాలు తెలియజేయాలని పేర్కొన్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలివే..

  • బహిరంగ ప్రదేశాలు, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగరవేయాలి.
  • విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు, సబ్ స్టేషన్ల వద్ద కైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగరవేయడం ప్రమాదకరం.
  • కాటన్ మాంజాలను మాత్రమే, గ్లాస్ కోటింగ్ లేనివి మాత్రమే వాడాలి. నైలాన్, సింథటిక్ మాంజాలను వాడకూడదు.
  • మెటాలిక్ మాంజాలకు కరెంట్ పాస్ అవుతుంది. అవి విద్యుత్ లైన్లపై పడితే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.
  • పొడి వాతావరణంలో మాత్రమే పతంగులు ఎగరవేయాలి. తేమ వాతావరణంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
  • పతంగులు, మాంజాలు విద్యుత్ లైన్లపై పడ్డప్పుడు వాటిని వదిలేయాలి. అలాకాకుండా వాటిని లాగితే కరెంట్ తీగలు ఒకదానికొకటి తగిలి ప్రమాదం జరగొచ్చు.
  • బాల్కనీ, గోడల మీద నుంచి పతంగులు ఎగరవేయరాదు. కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది.
  • పతంగులు ఎగరవేసేటప్పుడు పేరెంట్స్ తమ తమ పిల్లలను గమనిస్తూ ఉంటే మంచిది.

Latest Updates