కివీస్ ను తొలి దెబ్బ తీసిన బుమ్రా

మాంచెస్టర్ : వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న తొలి సెమీఫైనల్ లో బౌలర్లు భారత్ కు శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో ఓపెనర్ గుప్తిల్ ను జస్ ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. 14 బాల్స్ లో కేవలం 1 రన్ మాత్రమే చేసిన గుప్తిల్.. విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బుమ్రా బంతి… గుప్తిల్ బ్యాట్ ను తాకి… సెకండ్ స్లిప్ లో ఉన్న కోహ్లీ చేతుల్లో పడింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది న్యూజీలాండ్.

భారత బౌలర్లు తొలి రెండు ఓవర్లను మెయిడెన్ చేయడం విశేషం. భువనేశ్వర్, బుమ్రా టఫ్ బౌలింగ్ తో పరుగులు ఇవ్వకుండానే ఇద్దరి తమ తొలి ఓవర్లను పూర్తిచేశారు. బుమ్రా తన రెండో ఓవర్లోనే కివీస్ తొలి వికెట్ పడగొట్టాడు.