పరుగుల వేటలో భారత్ వెనకడుగు : కివీస్ దే టీ20 సిరీస్

సెడాన్ పార్క్ లో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియాపై లోకల్ టీమ్ న్యూజీలాండ్ సూపర్ విక్టరీ కొట్టింది. న్యూజీలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది. ఐతే… పరుగులవేటలో భారత్ వెనుకబడిపోయింది. చివరివరకు ఆసక్తిగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.

213 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా మొదటినుంచీ వేగంగానే ఆడింది. ధావన్ 5, రోహిత్ శర్మ 38, విజయ్ శంకర్ 43, రిషభ్ పంత్ 28, హార్దిక్ పాండ్యా 21 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత… మరో 28 బాల్స్ లో 68 రన్స్ కొట్టాల్సిన టైమ్ లో దినేష్ కార్తీక్ 33, కృణాల్ పాండ్యా 26 రన్స్ తో వేగంగా ఆడి పోరాడినా… గెలిపించడం వారికి శక్తికి మించిన పనే అయ్యింది. లాస్ట్ ఓవర్ లో 16 రన్స్ అవసరం. 3 బాల్స్ లో 14 రన్స్ కొట్టాల్సిన టైమ్ లో కివీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 19.4 బంతికే ఇండియా ఓటమి ఖరారైంది. చివరి బంతికి కార్తీక్ సిక్స్ కొట్టడంతో ఓటమి అంతరం తగ్గింది. కేవలం 4 రన్స్ తేడాతో ఇండియా ఓడిపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 రన్స్ చేసింది ఇండియా.

అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇండియా. బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ ఓపెనర్లు బుల్లెట్ బిగినింగ్ ఇచ్చారు. సీఫర్ట్ 43(23 బాల్స్ 3 ఫోర్లు, 3 సిక్సులు), మన్రో 72(40 బాల్స్ 5 ఫోర్లు, 5 సిక్సులు).. తొలి వికెట్ కు 7.4 ఓవర్లలోనే 80 రన్స్ పార్ట్ నర్ షిప్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా మిడిలార్డర్ ఆ జోరు కంటిన్యూ చేసింది. విలియంసన్ 27, గ్రాండ్ హోమ్ 30 రన్స్ చేశారు. చివర్లో మిషెల్ 19 రన్స్, టేలర్ 14 రన్స్ తో నాటౌట్ గా ఉన్నారు. వచ్చిన అందరు ప్లేయర్లు బ్యాట్ కు పనిచెబుతూ… భారత బౌలర్లను ఆటాడుకున్నారు. రోహిత్ శర్మ టీమ్ కు 213 రన్స్ భారీ టార్గెట్ పెట్టారు.  కులదీప్ యాదవ్ 2 వికెట్లు తీస్తే.. భువీ, ఖలీల్ చెరో వికెట్ పడగొట్టారు.

 

Latest Updates