చాన్స్‌‌ను వాడుకోవడంపైనే నా దృష్టి

టీ20 వరల్డ్‌‌కప్‌‌ కోసం అప్పుడే ఆలోచించడం లేదని, ఆ లోపు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే తన దృష్టి ఉందని విండీస్​తో తొలి మ్యాచ్​లో సత్తాచాటిన లోకేశ్‌‌ రాహుల్‌‌ అన్నాడు. ‘వరల్డ్‌‌ టీ20కి చాలా టైముంది. రెండు సిరీస్‌‌ల తర్వాత నాకు టాపార్డర్‌‌లో చాన్స్‌‌ వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంపైనే నా దృష్టంతా ఉంది. వరల్ట్‌‌కప్‌‌ కంటే ముందు ఇంకా చాలా గేమ్స్‌‌ ఉన్నాయి . అందువల్ల ఇదే ఫామ్‌‌ను కొనసాగించాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. ఉప్పల్‌‌లో ఇరుజట్లు చేసిన స్కోర్లు చూసి పిచ్‌‌ బ్యాటింగ్‌‌కు అనుకూలం అనుకుంటే పొరపాటేనని చెప్పాడు. పిచ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌కు పరీక్ష పెట్టిందని లోకేశ్​ తెలిపాడు.

Latest Updates