రాహుల్ వన్ మ్యాన్ షో.. బెంగళూరుపై పంజాబ్ విక్టరీ

తొలి మ్యాచ్‌ లో ఎదురైన సూపర్‌‌ ఓవర్‌‌ పరాజయాన్ని పక్కనబెడుతూ.. కింగ్స్‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ ఐపీఎల్‌‌లో చెలరేగిపోయింది..!కెప్టెన్‌‌ లోకేశ్‌ రాహుల్‌‌ (69 బాల్స్‌ లో132 నాటౌట్‌‌, 14 ఫోర్లు, 7 సిక్సర్లు)సెంచరీతో వన్‌‌ మ్యాన్‌‌ షో చేయగా… బౌలర్లు కూడా అంచనాలను అందుకున్నారు..! దీంతో బలమైన అపోజిషన్‌‌ బెంగళూరును పరుగుల వేటలో కట్టడి చేస్తూ పంజాబ్‌‌ అత్యద్భుతమైన విజయాన్ని అందుకుంది..! మరోవైపు ఒక్కరంటే ఒక్కరు కూడా ఓపిక చూపెట్టలేకపోయిన ఆర్‌‌సీబీ వరల్డ్‌‌క్లాస్‌‌ ప్లేయర్లందరూ…పెవిలియన్‌‌కు పోటీపడ్డారు..!!

ఫస్ట్​ మ్యాచ్​ ఓటమి నుంచి పంజాబ్ వెంటనే కోలుకుంది . సీజన్​లో లోకేశ్​ రాహుల్ ఫస్ట్​ సెం చరీతో చెలరేగడంతో లీగ్ లో బోణీ కొట్టింది.గురువారం జరిగిన లీగ్‌‌ మ్ యాచ్‌ లో కింగ్స్​ ఎలెవన్​ 97 రన్స్‌ తేడాతో ఆర్సీబీపై గెలిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌ చేసిన పంజాబ్‌‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు206 రన్స్‌ చేసిం ది. తర్వాత బెంగళూరు 17 ఓవర్లలో 109 రన్స్‌ కే కుప్పకూలింది. వాషింగ్టన్‌ సుందర్‌ (27 బా ల్స్‌ లో 30, 2 ఫోర్లు, 1 సిక్స్‌ ) టాప్‌ స్కోరర్‌ . డివిలియర్స్‌ (18 బా ల్స్‌ లో 28, 4 ఫోర్లు, 1 సిక్స్‌ ) ఫర్వాలేదనిపించాడు. రా హుల్‌‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ’ అవార్డు లభించింది.

కెప్టెన్‌‌ ఇన్నింగ్స్‌ …

ఆర్‌ సీబీ టాప్‌ పేసర్లు ఎదురుగా ఉన్నా.. కింగ్స్‌ కెప్టెన్‌ రాహుల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇన్నింగ్స్‌ ను కొనసాగించాడు. ఫస్ట్‌‌ ఓవర్‌ లాస్ట్‌‌ బాల్‌‌ను బౌండ్రీ దాటించి టచ్‌ లోకి వచ్చిన అతను.. సెకండ్‌ ఓవర్‌ లో మరో రెండు ఫోర్లతో కుదురుకున్నాడు. ఉమేశ్‌ , స్టెయిన్‌ , సైనీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రెండో ఎండ్‌ లో మయాంక్‌ (20 బా ల్స్‌ లో 26, 4 ఫోర్లు) కూడా దీటుగానే స్పందించాడు. ఓవర్‌ కు ఒకటి, రెండు ఫోర్లు బాదడంతో.. పవర్‌ ప్లే ముగిసేసరికి పంజాబ్‌‌ 50 రన్స్‌ చేసింది. కానీ ఏడో ఓవర్‌ లో ఛేంజ్‌ బౌలర్‌ గా వచ్చిన స్పిన్నర్‌ చహల్‌‌ (1/25).. ఆర్‌ సీబీకి ఫస్ట్‌‌ బ్రేక్‌ ఇచ్చాడు. పర్‌ ఫెక్ట్‌‌ గూగ్లీతో మయాంక్‌ వికెట్లను పడగొట్టాడు. దీంతో తొలి వికెట్‌ కు 57 రన్స్‌ పార్ట్‌‌నర్‌ షిప్‌ ము గిసింది. వన్‌ డౌన్‌ లో వచ్చిన పూరన్‌ (17) ఈసారి నెమ్మదిగా ఆడాడు. ఫలితంగా ఫస్ట్‌‌ టెన్‌ లో పంజాబ్‌‌ స్కోరు 90/1కి చేరింది. ఓ ఎండ్‌ లో చహల్‌‌ను కొనసాగించిన కోహ్లీ.. మరో ఎండ్‌ లో పేసర్లతో ప్రయోగం చేశాడు. దీంతో తర్వాతి రెండు ఓవర్లలో 10 రన్స్‌ వచ్చాయి . ఈ క్రమంలో రా హుల్‌‌ 36 బాల్స్‌ లో ఫిఫ్టీ కంప్లీట్‌ చేశాడు. అయితే 13వ ఓవర్‌ లో సైనీ 14 రన్స్‌ ఇచ్చుకోవడంతో బౌలింగ్‌‌ ఛేంజ్‌ అనివార్యమైంది. ఈ టైమ్‌ లో వచ్చిన దూబే (2/33)…పూరన్‌ ను ఔట్‌ చేయడంతో రెం డో వికెట్‌ కు 57 రన్స్‌ భాగస్వామ్యం ము గిసిం ది. ఓవరాల్‌‌గా 15 ఓవర్లలో 126/2 స్కోరు చేసిన పంజాబ్‌‌కు మళ్లీ దెబ్బ పడిం ది. భారీ ఆశలు పెట్టుకున్న మ్ యాక్స్‌ వెల్‌‌ (5)ను…16వ ఓవర్‌ లో దూబే ఔట్‌ చేయడంతో స్కోరు 128/3గా మారింది.

క్యూ కట్టారు..

టార్గెట్‌ ఛేజింగ్‌‌లో ఆర్‌ సీబీ బ్యాటింగ్‌‌ కంటే పంజాబ్‌‌ బౌలింగే అదిరింది. ఫించ్‌ (21 బా ల్స్‌ లో 20, 3 ఫోర్లు) నిలబడినా…ఇన్నింగ్స్‌ నా లుగో బాల్‌‌కే పడిక్కల్‌‌ (1)ను కాట్రెల్ (2/17) పెవిలియన్‌ కు పంపాడు. రెండో ఓవర్‌ మూడో బాల్‌‌కు ఫిలిప్​ (0)ని షమీ ఎల్బీగా వికెట్ల ముందు దొరికించుకున్నాడు. మూడో ఓవర్‌ నాలుగో బాల్‌‌కు కెప్టెన్‌కోహ్లీ (1) ఇచ్చిన క్యాచ్‌ ను మిడాఫ్‌ లో బిష్ణోయ్‌ ఈజీగా అందుకున్నాడు. 4 రన్స్‌ కే టాప్‌ 3 వెనక్కి వచ్చేసింది.  దీంతో ఇన్నింగ్స్‌ ను నిర్మించే బాధ్యత తీసుకున్న ఫించ్‌ , డివిలియర్స్‌ నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. ఐదో ఓవర్‌ లో 6, 4తో ఏబీ టచ్‌ లోకి వచ్చాడు. ఆరో ఓవర్‌ లో మూడు ఫోర్లు రావడంతో పవర్‌ ప్లేలో బెంగళూరు 40/3 స్కోరు చేసింది. మిడిల్‌‌ ఓవర్స్‌ ను అద్భుతంగా హ్యాండిల్‌‌ చేసిన బిష్ణోయ్‌ (3/32), ము రుగన్‌ అశ్విన్‌ (3/21).. బెంగళూరును ఊహిం చని దెబ్బ కొట్టారు. ఈ ఇద్దరు కలిసి నాలుగు బాల్స్‌ తేడాలో ఫించ్‌ , ఏబీని ఔట్‌ చేయడంతో ఆర్‌ సీబీ 57 రన్స్‌ కు సగం జట్టును కోల్పోయింది. సుందర్‌ , దూబే (12) ఏదో ఆడాలన్న తరహాలో బ్యాటింగ్‌‌ చేయడంతో తొలి పది ఓవర్లలో 63/5 స్కోరు వచ్చిం ది. ఓ సిక్స్‌ బాదిన దూబేను..మ్యాక్స్‌ వెల్‌‌ బోల్తా కొట్టించగా, ఆ వెంటనే ఉమేశ్‌(0)ను బిష్ణోయ్‌ వెనక్కి పంపాడు. 16వ ఓవర్‌ లో సిక్సర్‌ కొట్టిన సుందర్‌ .. తర్వాతి బాల్‌‌కే వికెట్‌ ఇచ్చుకున్నాడు. 24 బా ల్స్‌ లో 105 రన్స్‌ చేయాల్సిన దశలో సైనీ (6), చహల్‌‌ (1) కూడా ఔట్‌ కావడంతో ఆర్‌సీబీకి భారీ ఓటమి తప్పలేదు.

Latest Updates