మయాంక్ వీర బాదుడు.. షార్జాలో సిక్సర్ల వర్షం

షార్జా: ఐపీఎల్‌-13లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌   దూకుడుగా ఆడుతుంది.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ మెరుపు ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 60 రన్స్ చేసి, ఈ సీజన్ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేసిన టీమ్ గా నిలిచింది. ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్ 26 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ఓపెనింగ్‌ జోడీని  విడదీసేందుకు రాజస్థాన్‌ బౌలర్లు శ్రమిస్తున్నారు.   రాజస్థాన్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ  ఓపెనింగ్‌ జోడీ భారీ షాట్లతో విరుచుకుపడుతుంది.  10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 110 రన్స్‌ చేసింది. మయాంక్(69 పరుగులు 6 సిక్సర్లు, 5 ఫోర్లు) రాహుల్( 36 పరుగులు 4 ఫోర్లు)తో క్రీజులో ఉన్నారు. వీరిద్దరు మరిన్ని ఓవర్లు క్రీజులో ఉంటే పంజాబ్ ఈ సీజన్ లోనే అత్యధిక స్కోర్ చేసే టీమ్ గా కనిపిస్తోంది.

kl-rahul-mayank-agarwal-post-highest-powerplay-score-this-season

Latest Updates