ఫోర్త్ ప్లేస్ లో కేఎల్ రాహుల్ బెటర్: వెంగ్ సర్కార్

టీమిండియాకు నంబర్ ఫోర్ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనేదానిపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. మరో రెండు వారాల్లో  వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. కానీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ ఎవరు చేస్తారనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. ఒపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, మూడో స్థానంలో కొహ్లీ ఆడుతున్నాడు. నంబర్ ఫోర్ లో ధోనీ లేదా విజయ్ శంకర్ అని చర్చ జరుగుతోంది.  అయితే మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ మాత్రం ఇంకో ఆప్షన్ గా కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఆడించాలని అని అన్నాడు. కేఎల్ రాహుల్ టెక్నికల్ బ్యాట్స్ మెన్ అని ఇంగ్లాండ్ పిచ్ లకు అతని టెక్నిక్ ఉపయోగపడుతుందని అన్నాడు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో కూడా అధ్బుతంగా రాణించాడు.

 

Latest Updates