కొత్త సరుకు: తక్కువ ధరల్లో​ 4కే టీవీలు

హైదరాబాద్‌‌, వెలుగు: కోడక్‌‌ బ్రాండ్‌‌ టీవీలను తయారు చేసే నోయిడాకు చెందిన సూపర్‌‌ ప్లాస్ట్రోనిక్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ (ఎస్పీఎస్‌‌ఎల్‌‌) ఇండియా మార్కెట్లోకి తక్కువ ధరల్లో సీఏ సిరీస్‌‌ 4కే స్మార్ట్‌‌టీవీలను విడుదల చేసింది. ఇవి 43, 50, 55, 65 ఇంచుల్లో లభిస్తాయి. ధరలు రూ.24 వేల నుంచి మొదలవుతాయి. వీటిలో అండ్రాయిడ్‌‌ టీవీ 9 ఓఎస్‌‌, డాల్బీ విజన్‌‌ మ్యూజిక్‌‌, క్రోమ్‌‌కాస్ట్‌‌ వంటి సదుపాయాలు ఉంటాయి.

వ్యూ నుంచి కూడా చౌక స్మార్ట్‌‌టీవీ

మరో స్మార్ట్‌‌టీవీ మేకర్‌‌ వ్యూ టెలివిజన్స్ కూడా వ్యూ ప్రీమియం 4కే టీవీలను విడుదల చేసింది. ఇవి 43, 50, 55 ఇంచుల్లో లభిస్తాయి. ధరలు రూ.25 వేల నుంచి మొదలవుతాయి. వీటిలో డాల్బీ విజన్‌‌, హెచ్‌‌డీఆర్‌‌ 10, వీఓడీ అప్‌‌స్కేలర్‌‌, అండ్రాయిడ్‌‌ టీవీ 9ఓఎస్‌‌, క్రికెట్‌‌ మోడీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Latest Updates