16 సీట్లతోనే ఢిల్లీలో ప్రభుత్వమా?: కోదండరాం

సారూ.. కారు 16 స్థానాలు గెలిస్తేనే ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు టీజేఎస్ అధ్యక్షులు  కోదండరాం. మహబూబాబాద్ పట్టణంలో పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి  కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ‘25 పార్టీల జాతీయ కూటమిలో TJS కూడా ఉంది. సారు.. కారు 16 ఎంపీ స్థానాల లోపే పరిమితం. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడాలంటే 16 సీట్లు సరిపోవు. TJS పోటీ చేయని నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తాం. టీజేఎస్ 165 గ్రామాల్లో 4 వేల మంది రైతులను సర్వే చేసింది. సర్వేలో దాదాపుగా 25 శాతం మంది రైతులకు రైతు బంధు పథకం అమలు కాలేదు. కౌలు రైతుల హక్కులు గుర్తించడమే కాకుండా… పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. పొడు భూముల సమస్యను పరిష్కరించాలి‘ అని అన్నారు.

Latest Updates