కేసీఆర్ వల్ల రైతులు కూలీలయ్యారు : కోదండరాం  

మిడ్ మానేరు : కేసీఆర్ వల్ల రైతులు కూలీలుగా మారారన్నారు కోదండరాం. శుక్రవారం మిడ్ మానేరు సభలో మాట్లాడిన ఆయన..నలుగురికి పని చూపించిన నిర్వాసితులు కూలీ పనికి వెళ్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదన్న ఆయన..మిడ్ మానేరు కట్ట చూసిపోతున్నారు కానీ నిర్వాసితుల కష్టాలు చూడటంలేదన్నారు. సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల బతుకు చిత్రం చెడిపోయిందన్న కోదండరాం..పనులు చేసుకోవాల్సిన సమయంలో ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని తెలిపారు.

ఇలాంటి తెలంగాణ ఎందుకు తెచ్చినవని ప్రజలు తనను నిలదీస్తున్నారు? అని తెలిపారు కోదండరాం. మిడ్ మానేరు సమస్యలు తీరే దాకా మీ వెంటే ఉంటమని తెలిపారు. మిడ్ మానేరు రంగుల ఇండ్ల వెనక దుఃఖాన్ని చూడండని చెప్పారు. బాధాకరమైన జీవితాలను చూడకుండా మిడ్ మానేరు నీళ్లు చూసి కేసీఆర్ సంబరపడుతున్నారని..కేసీఆర్ అత్తగారి ఊర్లో పెట్టిన ఈ  సభతోనైనా దిగిరావాలన్నారు. సీఎం ఈ ప్రాంతానికి వచ్చిన రోజు భారీ నిరసన తెలపాలని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ఇసుక డబ్బులు ఇస్తే వీళ్ల బతుకులు బాగవుతాయన్నారు. మీ పోరాటంలో మేము అండగా ఉంటామన్న కోదండరాం.. 👉తెలంగాణ సాధించడం కంటే అభివృద్ధి కోసం చేసే పోరాటం పెద్దదని చెప్పారు.

Latest Updates