ఇంటర్ బోర్డు వైఫల్యాలపై రేపు కోదండరాం దీక్ష

ఇంటర్ బోర్డు వైఫల్యాలపై రేపు(శనివారం) తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం నిరసన దీక్షకు దిగనున్నారు. ఇంటర్ ఫలితాలలో అవకతవకలు ఏర్పడటంతో …విద్యార్థుల ఆత్మహత్యాలు చేసుకున్నారు. దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యల తర్వాత స్పందించిన ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. తప్పిదాలను తేల్చి ఫెయిల్ అయిన విద్యార్థుల రీవాల్యూషన్ ను ఉచితంగా చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలలో ప్రస్తుతం రీవాల్యుషన్ ప్రక్రియ పూర్తికాగా ఫలితాలు ప్రాసెసింగ్ జరుగుతోంది. ఫలితాలలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ, చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించి విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయంపై శనివారం దీక్ష నిర్వహించనున్నారు కోదండరాం. ఈ దీక్షకు విపక్ష పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest Updates