అగ్నివేశ్ చెబితేనే ఎన్టీఆర్ సన్యాసం తీసుకుండు

స్వామి అగ్నివేష్ మృతి ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. అగ్నివేష్ మృతికి సంతాపం ప్రకటించిన కోదండంరాం..అగ్నివేష్ చెప్పిన మాటల వినే దివంగత ఎన్టీఆర్ సన్యాసం తీసుకున్నారని అన్నారు.

తెలంగాణ ఏర్పడి 7 ఏళ్లైన   నిరుద్యోగ యాత్ర చేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఏర్పడడం దారుణమన్నారు.  ఆంధ్రప్రదేశ్ లాగా స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ఒక చట్టం చేయాలన్నారు. నిరుద్యోగులకు  నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.  ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన కు క్యాలెండర్ ప్రకటించాలన్నారు.  నాగులు లాంటి వాళ్ళు ఆత్మహత్యయత్నం చేసుకున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచన చేయాలన్నారు. కరోనా కాలంలో పేద మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.

రాష్ట్రంలో లక్ష48 వేల 16 పోస్టులకు  పైగా  ఖాళీగా ఉన్నాయన్నారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో  దాదాపు  50,000 కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.   పేద రైతుల హక్కులను కాపాడే విధంగా చట్టాలు ఉండాలన్నారు.  పట్టా పుస్తకాలు, రిజిస్ట్రేషన్ ల మీదనే కొత్త రెవెన్యూ చట్టంలో మార్పు లు చేశారన్నారు.  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ చట్టంలో పరిష్కారం చూపలేదన్నారు.  సాదా భినమా, పోడు భూములు, అసైన్డ్ భూముల, కౌలు రైతుల సమస్యలపై రెవెన్యూ చట్టంలో వీటిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు.  అసైన్డ్ భూములను రైతుల దగ్గర నుండి బెదిరించి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు కోదండరాం.

Latest Updates