సీఎం ఉన్నారో.. లేరో అర్థం కాని పరిస్థితి

రాష్ట్రంలో పరిపాలన కుప్పకూలిందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. సీఎం ఉన్నారో…. లేరో కూడా అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. జనగాం జిల్లాలో వాకర్స్ తో మాట్లాడారు కోదండరాం. రాష్ట్రంలో బతుకు దెరువు సమస్య కీలకమని చెప్పారు. టీచర్లు, వాలంటీర్లు, చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు బతుకుదెరువు కోసం పోరాడుతున్నారని చెప్పారు. బతుకుదెరువు నిలబెట్టు…. తెలంగాణను కాపాడు నినాదంతో ప్రచారం చేయనున్నట్లు కోదండరాం తెలిపారు. అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని…. తర్వాత ప్రచార యాత్రను చేస్తామన్నారు కోదండరాం.

సోషల్ మీడియాలో వస్తున్నవార్తలను నమ్మొద్దు

Latest Updates