ఆర్టీసీ గురించి ప్రభుత్వం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు

కమిటీల ద్వారా సమస్యలు పరిష్కారం కావని.  చర్చల ద్వారానే అవుతాయన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఆర్టీసీ గురించి ప్రభుత్వం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. కామారెడ్డిలో కార్మికుల సమ్మెకు మద్దతిచ్చారు కోదండరాం. ఆర్టీసీ కడుతున్న దానికంటే…. ప్రభుత్వం నుంచి వచ్చేది చాలా తక్కువ అన్నారు. ఇవ్వాల్సింది ఇవ్వకుండా….  కార్మికులే  ఆర్టీసీ నష్టానికి కారణం అనడం కరెక్ట్ కాదన్నారు. చర్చలు జరపాలని కోర్టు సూచించినా… మళ్ళీ ఈడీ కమిటీ వేయడమేంటని ప్రశ్నించారు కోదండరాం.

Latest Updates