సర్పంచుల సమస్యలు గవర్నర్ దృష్టికి : కోదండరాం

సర్పంచుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. ఈ ఐదేళ్లల సీఎం కేసీఆర్ సర్పంచుల సమస్యలను చెప్పడానికి టైం కూడా ఇవ్వలేదన్నారు. సమస్యల పరిష్కరం కోసం సర్పంచులంతా ఏకమై రోడ్డెక్కాలన్నారు .అక్టోబర్ 2న జరిగే ఆల్ పార్టీ మీటింగ్ లో  సర్పంచుల సమస్యలపై చర్చించి మద్దతిస్తామన్నారు. ఐదేళ్ల పాలనలో యూనివర్సిటీ, హాస్పిటల్స్, లోక్ యుక్త అన్ని నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. తెలంగాణ లో సర్పంచ్ లకు గౌరవం లేకుండా చేసిన ఘనత కేసీఆర్ దక్కిందన్నారు  బీజేపీ నేత  డీకే అరుణ. ఊర్లల్లో మొక్కలు చస్తే సర్పంచ్ ను తీసేస్తామన్న సీఎం..హరితహారంలో మొక్కలు చస్తే ఎవరి పై చర్యలు తీసుకోవాలన్నారు.

Latest Updates