రేపు మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ అంత్యక్రియలు

శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ ఇవాళ కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆయన కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడ్డారు. గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని.. హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ లోని ఇంటికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. రేపు ఫిలింనగర్ ‘మహాప్రస్థానం’లో కోడి రామకృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు చెప్పారు.

Latest Updates