లెజెండ్ లేరిక..! సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

అగ్రస్థాయి తెలుగు సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్థతకు లోనై… మూడురోజుల కిందట గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు కోడి రామకృష్ణ. ఆయన ఆరోగ్యం విషమించడంతో… గురువారం వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం చికిత్సకు సహకరించలేదని.. ఆయన ఈ ఉదయం కన్నుమూశారని డాక్టర్లు చెప్పారు.

కోడి రామకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ దర్శకుడే కాదు. ఆయన అగ్రశ్రేణి డైరెక్టర్ కూడా. టాప్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను ఆయన రూపొందించారు. ట్రెండ్ ను బ్రేక్ చేస్తూ… సరికొత్త సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. దేవి, అరుంధతి సినిమాలతో తెలుగు తెరకు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించారాయన. గ్రాఫిక్స్ మాయాజాలంలోని మజాను తెలుగు సినీ పరిశ్రమకు అందించిన దర్శకుడిగా కోడిరామకృష్ణ పేరు తెచ్చుకున్నారు. కామెడీ, యాక్షన్, పొలిటికల్, మైథలాజికల్, జానపద సినిమాలు అన్నింటిలో ఆయన తీసిన ఎన్నో సినిమాలు ట్రెండ్ సెట్టర్లుగా నిలిచాయి. కోడి రామకృష్ణ మృతి వార్తతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది.

Latest Updates