పంజాగుట్ట మర్డర్ కేసులో నిందితుడు అరెస్ట్

koganti-satyam-was-arrested-in-ramprasad-murder-case

పంజాగుట్టలో శనివారం రాత్రి జరిగిన స్టీల్ ట్రేడర్ రాంప్రసాద్ మర్డర్ కేసులో నిందితుడు, మాజీ టీడీపీ నాయకుడు, ఇండస్ట్రియలిస్ట్ కోగంటి సత్యం ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన ఈ ఇద్దరు స్టీల్ వ్యాపారుల మధ్య పాత విభేదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. రాంప్రసాద్ కుటుంబసభ్యులు కూడా కోగంటి సత్యం కొద్దిరోజులు బెదిరిస్తున్నారని చెప్పడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. శనివారం నుంచి 3రోజుల పాటు దర్యాప్తు చేస్తూ… కోగంటి సత్యం కోసం ప్రత్యేక బృందాలతో వెతికారు. అటు విజయవాడలోనూ..  ఇటు హైదరాబాద్ లోనూ బంధువుల ఇళ్లలోనూ పోలీసులు ఆరా తీశారు. రాంప్రసాద్ హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కోగంటి సత్యం ను పోలీసులు అరెస్ట్ చేశారు.

స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ ను శనివారం రాత్రి పంజాగుట్ట వేంకటేశ్వరస్వామి టెంపుల్ దగ్గర గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు. కారు డ్రైవర్, స్థానికులు రాంప్రసాద్ ను యశోద హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అర్ధరాత్రి రాంప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే కత్తిపోట్ల కారణంగా ఓ ఆటోడ్రైవర్ చనిపోవడం.. తాజాగా ఇండస్ట్రియలిస్ట్ దారుణ హత్య సంఘటనలు… పంజాగుట్ట పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. దారుణాలు జరగడంతో.. డీజీపీ కూడా దృష్టిపెట్టారు. అక్కడ భద్రతపై ఉన్నతాధికారులతో ఆరా తీశారు. వ్యాపారి రాంప్రసాద్ మర్డర్ కేసును ప్రెస్టీజియస్ గా తీసుకుని… 48 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.

రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించి ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Latest Updates