ఐసీసీ ర్యాంకింగ్స్.. అందనంత ఎత్తులో కోహ్లీ, రోహిత్‌

టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌‌ రోహిత్‌ శర్మ ఐసీసీ సోమవారం ప్రకటించిన వన్డే బ్యాట్స్‌‌మన్‌‌ ర్యాంకింగ్స్‌‌లోతమ టాప్‌ ప్లేస్‌ లను మరింత బలోపేతం చేసుకున్నారు. బౌలింగ్‌‌ ర్యాంకుల్లో స్టార్‌ పేసర్‌ జస్‌ ప్రీత్‌ బుమ్రా టాప్‌ ప్లేస్‌ లోనే నిలిచితన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌ లో రాణించడంతో కోహ్లీ ,రోహిత్‌ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. కోహ్లీ (886 పాయింట్లు), రోహిత్‌ (868) తర్వాత పాకిస్థా న్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ బాబర్‌ అజమ్‌ (829) మూడో స్థానంలో ఉన్నాడు. శిఖర్‌ ధవన్‌‌ ఏడు స్థానాలు ఎగబాకి 15 వ ర్యాంక్‌ కు చేరగా, కేఎల్‌ రాహుల్‌ 21 స్థానాలు మెరుగుపర్చుకుని 50వ ర్యాంక్‌ సాధించాడు.బౌలింగ్‌‌ కేటగిరిలో ట్రెంట్‌ బౌల్ట్‌‌, ముజీబ్‌ ఉర్‌రెహమాన్‌‌, రబడ, కమిన్స్‌‌ వరుసగా బుమ్రా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌‌ కేటగిరీలో 27వ స్థానానికి చేరిన జడేజా ఆల్‌ రౌండర్‌ కోటాలో పదో ర్యాంక్‌ లో ఉన్నాడు.

see more news

పవన్ ను అడ్డుకున్న పోలీసులు..జనసేన ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

Latest Updates