కోహ్లీ, రోహిత్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు

టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ,ఓపెనర్ రోహిత్ శర్మ తన ఫెవరెట్ అని ఇంగ్లాండ్ ఫేసర్ టామ్ కరణ్ అన్నాడు. ఐపీఎల్ లో వారిద్దరితో ఆడేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. టామ్ కరణ్ ఐపీఎల్ లో రాజస్థన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే కోహ్లీ,రోహిత్ లను ఔట్ చేసేందుకు తన బౌలింగ్ కు పదును పెడుతున్నట్లు చెప్పాడు. కోహ్లీ, రోహిత్ ప్రపంచంలోనే గొప్పఆటగాళ్లని కొనియాడాడు. వారిద్దరితో ఆడటాన్ని తాను సవాల్ గా తీసుకుంటానన్నారు. తాను ఏ మ్యాచ్ ఆడినా తన ఎంపికపై ప్రభావం చూపుతుందన్నాడు. ప్రతీ మ్యాచ్ లో బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇవ్వడానికే ప్రయత్నిస్తానన్నాడు.స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, బట్లర్ లాంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడాన్ని తాను అదృష్టంగా భావిస్తానన్నాడు.

see more news

షేర్వానీతో మతిపోగొట్టిన ఇవాంక .. డిజైనర్ ఇండియానే

భారత్ -అమెరికా మధ్య కీలక ఒప్పందాలివే..

 

Latest Updates