సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్

kohli-breaks-sachin-record-fastest-11000-odi-runs

మాంచెస్టర్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా అతి తక్కువ ఇన్నింగ్‌లలో 11వేల పరుగుల పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హసన్‌ ఆలీ వేసిన 45ఓవర్‌ రెండో బంతిని బౌండరీకి తరలించి విరాట్‌ ఈ రికార్డును చేరుకున్నాడు. 222 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోవడం విశేషం.

దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వన్డేల్లో 11వేలు పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. అతని కంటే ముందు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌(276ఇన్నింగ్స్‌ల్లో), రికీ పాంటింగ్‌(286), సౌరవ్‌ గంగూలీ(288), కలిస్‌(293), సంగక్కర(318), ఇంజమామ్‌-ఉల్‌-హక్‌(324), సనత్‌ జయసూర్య(354), జయవర్డనే(368) మాత్రమే ఉన్నారు.

Latest Updates