సెంచరీ చేయకుండానే ఏడాదిని ముగించిన కోహ్లీ

కాన్‌‌బెర్రా: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో వేగంగా 12 వేల రన్స్ పూర్తి చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. దీన్ని పక్కనబెడితే.. ఈ మ్యాచ్‌‌లో కోహ్లీ 63 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఈ క్యాలెండర్‌‌ ఇయర్‌‌లో ఈ వన్డే టీమిండియాకు ఆఖరుది. దీంతో వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా కొట్టకుండానే ఏడాదిని కోహ్లీ ముగించాడు. 2008లో కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒక క్యాలెండర్ ఏడాదిని సెంచరీ చేయకుండానే ముగించడం విరాట్‌‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Latest Updates