ఒక్క పాయింటే తేడా! : టాప్‌‌ ర్యాంక్‌‌కు చేరువలో కోహ్లీ

దుబాయ్‌‌: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌‌లో డబుల్‌‌ సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ.. ఐసీసీ టెస్ట్‌‌ ర్యాంకింగ్స్‌‌లో టాప్‌‌ ర్యాంక్‌‌కు మరింత చేరువయ్యాడు. సోమవారం విడుదల చేసిన తాజా జాబితాలో విరాట్‌‌ 936 పాయింట్లతో రెండో స్థానంలో
కొనసాగుతున్నా.. నంబర్‌‌వన్‌‌లో ఉన్న స్టీవ్‌‌ స్మిత్‌‌ (937)కు మధ్య తేడా ఒక్క పాయింట్‌‌ మాత్రమే ఉంది. రాంచీలో జరిగే మూడో టెస్ట్‌‌లో రాణిస్తే టాప్‌‌ ర్యాంక్‌‌ కోహ్లీ సొంతమవుతుంది.

ఇక పుణె టెస్ట్‌‌లో  సెంచరీ (108)తో  చెలరేగిన మయాంక్‌‌ అగర్వాల్‌‌ ఎనిమిది స్థానాలు మెరుగై17వ ర్యాంక్‌‌ను దక్కించుకున్నాడు. మిగతా వారిలో పుజారా నాలుగు, రహానె తొమ్మిదో ర్యాంక్‌‌ల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌‌లో స్పిన్నర్‌‌ అశ్విన్‌‌ మూడు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌‌లో నిలిచాడు.

Latest Updates