కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోవాలి

చండీగఢ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో సారథ్యాన్ని వదులుకోవాలని లెజెండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ అన్నారు. కోహ్లి గైర్హాజరీలో రహానె సారథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియాపై నాలుగు టెస్టుల సిరీస్‌‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రహానె కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించిన బేడీ.. విరాట్ టెస్టు కెప్టెన్సీని వదులుకుంటే బెటర్ అని సూచించాడు. గాయాలతో కూడిన జట్టుతో సిరీస్ గెలవడం మామూలు విషయం కాదని, రహానె కెప్టెన్సీ భారత పూర్వ సారథి టైగర్ పటౌడీని గుర్తు చేసిందన్నాడు.

‘విరాట్ కోహ్లీ ఇంకా చాలా ఏళ్లు బ్యాటింగ్ చేయాలి. అతడు మనకు గొప్ప బ్యాట్స్‌‌మన్‌‌గా ఉండాలా లేదా కెప్టెన్‌‌గా నిలిచిపోవాలా అంటే బ్యాట్స్‌‌మన్‌‌గా ఉండాలనే చెబుతా. టెస్టుల్లో టీమిండియాను అజింక్యా రహానె నడపగలడు. కోహ్లి, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు రహానెకు అవసరమైన సూచనలు ఇవ్వగలరు. రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌‌లో కోహ్లీనే రహానేకు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెబితే మర్యాదగా ఉంటుంది’ అని బేడీ పేర్కొన్నాడు.

Latest Updates