కోహ్లీ రికార్డుల వేట ఆగడం లేదు…

వీరాట్ కోహ్లీ.. తన రికార్డుల వేట ఆపడం లేదు సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 254 (నాటౌట్ )తో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

  • 254 (నాటౌట్) కోహ్లీకి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంతకుముందు శ్రీలంకపై 243 పరుగులు చేశాడు.
  • టెస్టుల్లో 7 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. భారత బ్యాట్స్ మన్లలో కోహ్లీది 7వ ప్లేస్.
  • టీమిండియా తరపున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డ్. తన కెరీర్​లో 7వ డబుల్ సెంచరీ చేసిన విరాట్..  సచిన్, సెహ్వాగ్​(6)లను అధిగమించాడు. బ్రాడ్​మన్​ 12, సంగక్కర 11, లారా 9 కోహ్లీ కంటే ముందున్నారు.
  • టెస్టుల్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్​ల్లో 26 సెంచరీల రికార్డు సాధించిన నాలుగో క్రికెటర్​ కోహ్లీ.
  • కెప్టెన్​గా 150 పైగా పరుగులు 9 సార్లు సాధించి.. ఆసీస్​ దిగ్గజం బ్రాడ్​మన్ (8)​ను అధిగమించాడు.

Latest Updates