కోహ్లీ నే మా కెప్టెన్‌

  • ఆర్ బీ టీమ్‌ డైరెక్టర్‌ హెసన్‌

బెంగళూరు: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును విరాట్‌ కోహ్లీనే నడిపిస్తాడని ఆ జట్టు డైరెక్టర్‌(క్రికెట్‌ ఆపరేషన్స్‌) మైక్‌ హెసన్‌ తెలిపాడు. ఇప్పటిదాకా ఏడు సీజన్లలో ఆర్‌సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్‌ ఒక్కసారి కూడా జట్టు ను లీగ్‌ విజేతగా నిలపలేకపోయాడు. అయితే కోహ్లీపై తమకు  నమ్మకముందన్న హెస్సన్‌ కెప్టెన్సీ మార్పుపై ఇప్పటిదాకా చర్చ జరగలేదన్నాడు.

విజయ్‌హజారే, ముస్తాక్‌ అలీ టోర్నీల్లో సత్తా చాటిన ప్లేయర్లకు డొమెస్టి క్‌ కోటాలో జట్టులోకి తీసుకుంటామని చెప్పాడు. మైక్‌ హెసన్‌ను ఇటీవల డైరెక్టర్‌గా నియమించిన ఆర్‌సీబీ తమ జట్టు హెడ్‌ కోచ్‌గా సైమన్‌ కటిచ్‌ను ఎంచుకుంది. అంతేకాక టీమిండియా మాజీ ట్రైనర్‌ శంకర్‌ బసును జట్టు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా, ఇండియా మాజీ ఆటగాడు శ్రీధరన్‌ శ్రీరామ్‌ను బ్యాటింగ్‌, స్పి న్‌ బౌలింగ్‌ కోచ్‌గా, ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్‌ గ్రిఫిఫ్త్‌ను బౌలింగ్‌ కోచ్‌గా ఆర్‌సీబీ గురువారం నియమించింది.