తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నెల 6వ తేదీన శ్రీ వికారి నామ సంవత్సరం పురస్కరించుకుని  ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ తెల్లవారు జామున స్వామివారికి సుప్రభాతం, అర్చనసేవల  తర్వాత శ్రీవారి మూలవిరాట్టుపై పట్టు వస్త్రంతో అర్చకులు కప్పివేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, శ్రీవారి ఆలయంలోని ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరుస్తున్నారు. మధ్యాహ్నం 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ సిబ్బంది నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామివారికి కప్పి ఉంచిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం సమర్పించి… మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

 

Latest Updates