త‌ప్ప‌తాగి సివిక్ వాలంటీర్ ను దారుణంగా హ‌త్య చేశారు

కోల్‌క‌తా: అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఓ ప్రార్ధ‌న మందిరం ‌వ‌ద్ద త‌ప్ప‌తాగి హల్‌చ‌ల్ చేస్తున్న గ్యాంగ్ ను అడ్డుకున్నందుకు ఓ సివిక్ వాలంటీర్ ను దారుణంగా హ‌త్య ‌చేశారు. కోల్‌క‌తాలోని విద్యాసాగర్ బ్రిడ్జ్ ప‌రిధిలోని హేస్టింగ్స్ చ‌ర్చ్ వ‌ద్ద ఈ ఘోరం జ‌రిగింది. శ‌నివారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో కొంద‌రు వ్య‌క్తులు ప్రార్ధ‌నా మందిరం సమీపంలో మద్యం తాగుతుండ‌డం చూసి.. ఇర్షాద్ హుస్సేన్ అలియాస్ మొహమ్మద్ సన్నీ అనే సివిక్ వాలంటీర్ వారిని వారించాడు. ఆ ప్రదేశం వద్ద తాగ‌కూడ‌ద‌ని చెప్పాడు. ఈ క్ర‌మంలో ఆగ్ర‌హానికి లోనై న ఆ గ్యాంగ్ స‌న్నీ త‌ల‌పై ఓ ఇటుక రాయితో కొట్టారు. అంత‌టితో ఆగ‌కుండా.. అత‌ని త‌ల‌ని విద్యాసాగ‌ర్ బ్రిడ్జి యొక్క ఐర‌న్ డెక్ కేసి కొట్టారు. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న స‌న్నీని చూపి అక్క‌డి స్థానికులు.. అతన్ని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు. కానీ డాక్ట‌ర్లు స‌న్నీ అప్ప‌టికే చనిపోయినట్లు ప్రకటించారు.ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

Latest Updates