కోవిడ్-19 హాస్పిట‌ల్ లో జూనియ‌ర్ డాక్ట‌ర్ ఆత్మ‌హత్య‌

కోల్‌కతా న‌గ‌రంలో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో ఓ యువ డాక్ట‌ర్ ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆసుపత్రి భవనంలోని 6వ అంతస్తుపై నుంచి దూకి పౌలామీ సాహా(25) అనే ట్రైనీ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ గా ప‌ని చేస్తున్న పౌలామీ సాహా.. ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి, తన షిఫ్ట్ ప్రారంభం కాకముందే సూసైడ్ చేసుకోవాల‌ని భ‌వ‌నం పై నుంచి దూకింది. వెంటనే స్పందించిన అక్కడి వారు ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించగా.. అప్ప‌టికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటన గురించి ఓ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. ‘ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించాం. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆమె గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తేలింది. దీనిపై దర్యాప్తును ప్రారంభించాం. ఆమె మరణవార్తను కుటుంబసభ్యులకు తెలియజేశాం’ అని తెలిపారు.

Latest Updates