పదేళ్లనుంచి కృత్రిమ గుండెతో బతుకుతున్నాడు

గుండె మార్పిడి (హార్ట్‌‌ ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌‌)తో హార్ట్‌‌ ఫెయిల్యూర్‌ రోగుల జీవితకాలాన్ని పొడిగిస్తున్నారు. కృత్రిమ గుండెలతో రోగులకు పునర్జన్మనిస్తున్నారు. ఓ పశ్చిమబెంగాల్‌‌ వాసి హార్ట్‌‌ ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌‌లో అరుదైన ఘనత సాధించారు. అది కూడా కృత్రిమ గుండె. దేశంలో కృత్రిమ గుండెతో ఎక్కువ కాలం బతికిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. కోల్‌‌కతాకు చెందిన సంతోష్‌‌ దుగార్‌‌ (63)కు 2000 సంవత్సరంలో తొలిసారి హార్ట్‌‌ ఎటాక్‌‌ వచ్చింది. యాంజియోప్లాస్టీ చేశారు. కొద్దిరోజులు బాగానే పని చేసినా తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. స్టెమ్‌‌ సెల్‌‌ థెరపీ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌‌కు వెళ్లాల్సి వచ్చింది. అదీ పని చేయలేదు. తర్వాత వరుసగా హార్ట్‌‌ ఎటాక్స్‌‌ వచ్చాయి.

2009లో మళ్లీ గుండెపోటు వచ్చి చివరి స్టేజ్‌‌లో ఆస్పత్రిలో చేరారు. గుండెలా పని చేసే ఎల్‌‌వీఏడీ డివైస్‌‌ను అమర్చారు. ఇండియాలో ఇలాంటి పరికరం అమర్చిన 120 మందిలో దుగార్‌‌ ఒకరు. హార్ట్‌‌మేట్‌‌ టు పేరుతో యూఎస్‌‌ మార్కెట్‌‌లోకి వచ్చిన డివైస్‌‌ అప్పట్లో రూ.కోటి పలికింది. తర్వాత దిగొచ్చి రూ.54 లక్షలకు చేరింది. ఇప్పుడు కొత్త వెర్షన్‌‌ బయటకొచ్చింది. ‘ఆ డివైస్‌‌కు ఎంతైనా పెట్టొచ్చు. అది లేకుంటే నేను ఉండేవాణ్నే కాదు’ అన్నారు దుగార్‌‌.

Latest Updates