అమ్మ‌వారి ఉత్సవాల్లో తృణ‌మూల్ ఎంపీ నుస్రత్ జహాన్ డ్యాన్స్ (వీడియో)

కోల్‌క‌త్తా: క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా త‌గు జాగ్ర‌త్తలు పాటిస్తూ ఈ ఏడాది ద‌స‌రా ఉత్స‌వాల‌ను జ‌రుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అమ్మ‌వారి న‌వరాత్రులను జ‌రుపుకుంటున్నారు. కోల్ కతా నగరంలోనూ దుర్గాపూజా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమిని పురస్కరించుకుని టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ భ‌ర్త‌తో కలిసి ఈ పూజల్లో పాల్గొని డ్యాన్స్ చేశారు. అంతే కాదు, ఇతర మహిళలతో కలిసి స్టెప్పులు వేయడమే గాక.., ఉత్సాహంగా డ్రమ్స్ వాయించారు. ముఖాలకు మాస్కులు ధరించి అంతా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించారు. ముస్లిం మ‌హిళ అయిన నుస్రత్ జహాన్ గ‌తేడాది ఓ హిందువును పెళ్లి చేసుకున్నారు.

Latest Updates