కొడుకునే సీఎం చేసేందుకే కొత్త సెక్రటేరియట్: కోమటి రెడ్డి

సీఎం కేసీఆర్ తన కొడుకును సీఎం చేయడానికే కొత్త సెక్రటేరియట్ కడుతున్నారని అన్నారు నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి.  అప్పులు బాగా పెరిగిపోయాయని అలాంటప్పుడు కొత్త సెక్రటేరియట్ ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా చెబుతున్నాయని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదో తేదీన జీతాలు ఇచ్చారని..ఉద్యోగులకు ఐఆర్ కూడా ఇవ్వలేదన్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు కలిసిన కోమటి  రెడ్డి  పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వల మరమ్మతుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్ల కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులను నిలిపివేశారని అన్నారు. కాల్వల నుంచి నీళ్లు వెళ్లే మార్గం లేక పంటలు ఎండిపోతున్నాయని..పశువులకు కూడా నీరు లేదన్నారు.

భూసేకరణకు సంబంధించిన 50 కోట్లు, కాంట్రాక్టర్ల కు 45 కోట్ల వరకు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు ఇచ్చే నాలుగు రూపాయల ప్రోత్సాహకానికి సంబంధించి కూడా వంద కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఒకాక మదర్ డెయిరీ రైతులకే రూ. 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని..వెంటనే విడుదల చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు కోమటిరెడ్డి.

 

 

 

Latest Updates