కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం : ఎంపీ కోమటిరెడ్డి

ఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజలకు కోరుకున్నట్లు ఆశాజనకంగా లేదని..రైతుల గురించి కనీసం పట్టించుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాలను కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించలేదన్న ఆయన..కేంద్ర బడ్జెట్  తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్ అన్నారు. కేసీఆర్ వైఫల్యాల వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలిపారు.  ఐదు సంవత్సరాలు కేసీఅర్ మోడీ భజన చేశారని..గిరిజన విశ్వవిద్యాలయం, గేమ్స్ కు నిధులు కాళేశ్వరానికి జాతీయ హోదా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించలేదని తెలిపారు కోమటిరెడ్డి.

వ్యక్తిగత కారణాలవల్లనే సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఈ బడ్జెట్ లో కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం దారుణమన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల అన్ని వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న కోమటిరెడ్డి. దీనిపై పార్లమెంట్ లోపల బయట ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటం చేస్తామన్నారు.

 

Latest Updates