పార్టీ మార్పుపై సరైన సమయం కోసం చూస్తున్నా

వై.యస్ రాజశేఖర్ రెడ్డి పేరు నిలబడేలా జగన్ పాలన ఉండాలన్నారు తెలంగాణ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల రాజగోపాల్ రెడ్డి. మీడియాతో మాట్లాడుతూ… కాశ్మీర్ అంశంపై మోడి తీసుకున్న నిర్ణయంపై దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారన్నారు.. మోడి, అమిత్ షా నేత్రుత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. చైనా తర్వాత భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారిందంటే దానికి కారణం నరేంద్ర మోడీనే అన్నారు. భారతదేశపు ప్రజలందరూ మోడి వైపు చూస్తూన్నారని, పార్టీ మార్పు పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు కోమటి రెడ్డి..

Latest Updates