చెల్లని రూపాయి నేనా.? నీ కూతురా.? : కోమటిరెడ్డి

యాదాద్రి: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘన విజయం సాధించారు. భువనగిరి ప్రజలు తనను  ఎంపీ అభ్యర్థిగా గెలిపించి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారన్నారు.ఫలితాల అనంతరం కోమటిరెడ్డి యాదాద్రిలో  మీడియాతో మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపించిన భువనగిరి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

నల్గొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా అని గతంలో తననుద్దేశించి కేసీఆర్  అన్న మాటలను వెంకటరెడ్డి గుర్తు చేస్తూ… మరి ఇప్పుడు చెల్లని రూపాయి నేనా? నీ కూతురు కవితనా.? అంటూ సెటైర్లు వేశారు.

తన గెలుపును భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అంకితమన్నారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి. ఇకనుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా భువనగిరిని నిలుపుతానన్నారు. టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు తెలిపారు.

Latest Updates