కొమురవెల్లిని యాదాద్రిలా అభివృద్ధి చేయాలి

సిద్ధిపేట: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు మర్చిపోయే కేసీఆర్ సొంత జిల్లాలో మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేయకుండా మరిచిపోయారని విమర్శించారు.

మల్లన్న ఆలయానికి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలన్నారు. ‘మల్లన్న ఆలయాన్ని త్వరగా టెంపుల్ సిటీగా చేయాలి. ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. యాదాద్రి దేవాలయంలా మల్లన్న దేవాలయానికి కూడా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలి’ అని రఘునందన్ పేర్కొన్నారు.

Latest Updates