కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్ర సాధనలో తన ఇంటిని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఇచ్చిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీను… అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ విస్మరించారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 8వ వర్ధంతి సందర్భంగా ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన చిత్రపటానికి పులా మాల వేసి నివాళులర్పించారు రాములు నాయక్. ఈ సందర్భంగా మాట్లాడిన రాములు నాయక్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆకలి చావులు ఉండవని… చేనేత కార్మికుల బతుకులు మారుతాయని ముఖ్యమంత్రి మభ్యపెట్టారని… కానీ వారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.

ప్రభుత్వ శాఖలలో ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు వాడాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని… కానీ ఏ ఒక్కరు పాటించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించినప్పటి నుండి ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇచ్చి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 27న జరగనున్న కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు రాములు నాయక్.

Latest Updates